యువరత్న.మెగాస్టార్ లకు పోటీ కానున్న పీపుల్స్ స్టార్
on Dec 30, 2016
అవును ఇది ముమ్మాటికీ నిజమే ..బిచ్చగాడు సినిమా సంచలన విజయం తరువాత .ప్రముఖ నిర్మాత చదల వాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.. ఈ సినిమా తాము ఊహించిన దానికంటే బాగా రావడంతో చిరంజీవి బాలయ్య ల సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నప్పటికి వాటికి పోటీగా ఈ సినిమాను విడుదల చేయడానికి ఈ సినిమా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా బ్లాక్ మనీ మీద రూపొందింది. బ్లాక్ మనీ ని రూపు మాపడానికి ఈ సినిమా హీరో చేసే ప్రయత్నాలే సినిమా ప్రధాన ఇతివృత్తం. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మన ప్రధాని మోడీ బ్లాక్ మనీ ని రూపు మాపడానికి వెయ్యి .. ఐదు వందల రూపాయల నోట్లను మాఫీ చేయడం విశేషం .. ఆ విధంగా
దేశంలోనే ప్రదాని చేపట్టిన ఆర్థిక సంస్కరణకు మద్దతు తెలిపిన తొలి భారతీయ చిత్రం అవుతుంది. ఆర్. నారాయణ మూర్తి తన సహజ ధోరణి కాకుండా ఒక మధ్య తరగతి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య గా తన నటనా ప్రతిభను కనపరిచారు.. ఈ సినిమా నారాయణ మూర్తికి ఒక కొత్త ధోరణి సినిమా అవుతుంది.
హెడ్ కానిస్టిబుల్ వెంకట్రామయ్య సినిమా ముందు... పక్కా ప్లాన్ చేసుకున్నట్టు గానే షూటింగ్ పూర్తయింది. దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు ఆర్టిస్టుల నుండి ఏమి కావాలో అది రాబట్టు కున్నాడు..జయసుధ తన సహజమైన నటనను అద్భుతంగా పండించారు..నారాయణ మూర్తి జయసుధల మధ్య పోటా పోటీగా నటన సాగుతుంది.
సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం ఒక సంచలనం సృష్టిస్తుంది.. అద్భుతమైన సాహిత్య విలువలతో పాటలు రూపొందాయి.. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో పాటల చిత్రీకరణ సమయంలో యూనిట్ మొత్తం ఈ సినిమా విజయాన్ని ముందే ఊహించి మాట్లాడు కోవడం విశేషం..
ఈ సినిమా నిర్మాణ దశలోనే సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. సినిమా పరిశ్రమకు సంబందించిన వ్యాపార వర్గాల్లోనూ ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడింది,దాంతో వ్యాపార పరంగా కూడా చాలా మంది సినిమా కొనడానికి ముందుకు వస్తున్నారని భోగట్టా.. మొత్తం మీద సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా ఒక సంచలనం సాధిస్తుందని పరిశ్రమ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.