తమిళనాట పుష్పరాజ్ వినాయకచవితి.. హిందూ సంఘాల ఆగ్రహం
on Aug 28, 2025

'స్టైలిష్ స్టార్' గా ఉన్న అల్లు అర్జున్(Allu Arjun)'పుష్ప పార్ట్ 1'తో పాన్ ఇండియా వ్యాప్తంగా సత్తా చాటి 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ గా ఎస్టాబ్లిష్ అయిన విషయం తెలిసిందే. పార్ట్ 1 తో వచ్చిన ట్రెండ్ ని కంటిన్యూ చేస్తు 'తగ్గేదెలే' అంటు 'పుష్ప పార్ట్ 2'(Pushpa 2)తో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ రెండు భాగాల ద్వారా పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులని సంపాదించడమే కాకుండా, పుష్ప క్యారక్టర్ ని అభిమానులు ఓన్ చేసుకునేలా అల్లు అర్జున్ నటన కొనసాగింది. అందుకు నిదర్శనంగా నిలిచిన ఒక సంఘటన తమిళనాడు(Thamilandu)లో జరిగింది.
నిన్నప్రారంభమైన 'వినాయక చవితి' వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు 'గజముఖుడ్ని' పలు రూపాల్లో రూపొందించుకొని, భక్తితో ప్రార్దిస్తు తన్మయత్వం చెందటం పరిపాటి. తమ శక్తి కొలది భారీ స్థాయిలో మండపాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఈ కోవలోనే తమిళనాడులోని 'హొసూరు' కి చెందిన అల్లు అర్జున్ అభిమానులు వినాయక చవితి వేడుకల సందర్భంగా 'పుష్ప 2 'లో క్లైమాక్స్ ఫైట్ జరిగిన బిల్డింగ్ సెట్ లా ఉండేలా, ఎర్ర చందనం దుంగలు పోలిన వాటితో భారీ మండపాన్ని ఏర్పాటు చేసారు.మండపం బయట అల్లు అర్జున్ వాడిన హెలికాఫ్టర్, భుజంపై గన్ తో ఉన్న పుష్పరాజ్ ఉండగా, లోపల అమ్మవారి గెటప్ లో త్రిశూలం ధరించిన పుష్పరాజ్ కి వినాయకుడిగా ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తున్నారు.
ముప్పై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ సెట్టింగ్ కి సంబందించిన వీడియోని అల్లు అర్జున్ స్నేహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu)సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు. ఇక దేవుడి రూపానికి పుష్ప రాజ్ లాంటి ఒక స్మగ్లర్ ఆకారంలో రూపొందించడం పట్ల పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలోను తెలుగు నాట 'బాహుబలి' వినాయకుడు, పుష్ప వినాయకుడిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



