ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. పూరి మాస్టర్ ప్లాన్!
on Sep 6, 2022

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ ఒకరు. తక్కువ బడ్జెట్ తో తక్కువ టైంలో సినిమాలు చేసి సంచలన విజయాలను అందుకోవడం ఆయన స్టైల్. ఎందరో హీరోలకు కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలను అందించారు. అయితే ఎప్పుడూ లేని విధంగా భారీ బడ్జెట్ తో ఎక్కువ టైం తీసుకొని విజయ్ దేవరకొండతో 'లైగర్'ని తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా పూరి సినిమా అంటే మినిమం ఉంటుందనే అభిప్రాయాన్ని ఈ మూవీ తుడిచిపెట్టింది. ఈ బిగ్గెస్ట్ ఫ్లాప్ పూరిని ఆలోచనలో పడేసి, విజయ్ తో చేయాల్సిన 'జన గణ మన'ను పక్కన పెట్టేలా చేసింది. దీంతో ఇప్పుడు పూరి ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
పూరికి పడి లేవడం కొత్త కాదు. అయితే ఈసారి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. తను స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా, తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా నిలబెట్టాలని భావిస్తున్నారట. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆకాష్.. హీరోగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. 'ఆంధ్రా పోరి', 'మెహబూబా', 'రొమాంటిక్', 'చోర్ బజార్' ఇలా లీడ్ రోల్ పోషించిన నాలుగు సినిమాలూ పరాజయం పాలయ్యాయి. వీటిలో 'మెహబూబా'ను పూరి డైరెక్ట్ చేయగా, 'రొమాంటిక్'కు పూరి కథ అందించారు.
ఇప్పుడు పూరికి హిట్ ఎంత అవసరమో, ఆయన కుమారుడు ఆకాష్ కి అంతకంటే ఎక్కువ అవసరం. అందుకే ఇప్పుడు పూరి.. ఆకాష్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. 'లైగర్' తర్వాత డైరెక్టర్ గా పూరి చేయబోయే సినిమా ఇదేనని తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో తండ్రీకొడుకులు విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



