అమ్మాయిల రెస్పెక్ట్ గురించి పూరీ మాట్లాడుతున్నాడా?
on May 20, 2015
.jpg)
పూరీ జగన్నాథ్ గురివింద గింజలాంటోడట!...తన లేటెస్ట్ మూవీ జ్యోతిలక్ష్మి ట్రైలర్ విడుదల చేసినప్పటి నుచీ అంతా ఇదే అంటున్నారట. అంతలా ఏముందా ట్రైలర్లో అంటారా? ట్రైలర్ చివర్లో ఛార్మితో ఓ డైలాగ్ చెప్పించాడు లెండి. "ఆడదాన్ని అర్థంచేసుకోవాల్సిన అవసరం లేదు రెస్పెక్ట్ ఇస్తే చాలు" అన్నాడు. అప్పటి నుంచే వివాదం మొదలైంది. తన ప్రతి సినిమాలో అసేయ్, ఒసేయ్, రావే, పోవే....అని అమ్మాయిని కించపరుస్తూ డైలాగ్స్ రాసే పూరీ రోటీన్ కు భిన్నంగా... రెస్పెక్ట్ ఇవ్వండి అంటే కామెడీ కాక మరేంటి?. ఇది జోక్ ఆఫ్ ది ఇయర్ అన్నా ఆశ్చర్యపోనవరసం లేదంటున్నారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి పూరీ కామెంట్స్ చూస్తుంటే చెప్పేవి శ్రీరంగ నీతులు....అన్నట్టుందంటున్నారు. ఇన్నాళ్లకు అమ్మాయిలపై కాస్త పాజిటివ్ గా డైలాగ్స్ చెప్పించిన పూరీ....జ్యోతిలక్ష్మికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో చూద్దాం.....
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



