అదృష్టం వెనుక ఉన్న కష్టాన్ని గుర్తించండి!
on Aug 3, 2016
ఈ భూప్రపంచంలో ఏ ఒక్కడ్నీ అదృష్టం అంత ఈజీగా వరించదు. నానా కష్టాలు పడాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి. అప్పుడే అదృష్టం వచ్చి కౌగిలించుకుంటుంది. అయితే.. అందరూ ఆ కౌగిలించుకున్న అదృష్టాన్ని చూస్తారే తప్ప, అంతకంటే ముందు ఎదుర్కొన్నా ఇబ్బందులను గురించి మాట్లాడరు. పైగా "నువ్వు లక్కీ" అంటూ వెటకారానికి ఇంకాస్త వ్యంగ్యాన్ని జోడించి వెకిలి వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రస్తుతం "పెళ్లిచూపులు" ఫేమ్ ప్రియదర్శి కూడా అలాంటి కుళ్ళు కాంప్లిమెంట్స్ ను ఎదుర్కొంటున్నాడు. అందుకే తన మనసులోని భావాలని ఈ విధంగా పంచుకొన్నాడు.
"నువ్వు లక్కీరా, రాత్రికి రాత్రి స్టార్ అయ్యావ్" అని చాల మంది అంటుంటే, అవునా? ఇది నిజామా అని ఒక్కసారి ఆలోచించాను, కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు, పనికోసం అలమటించిన రోజులు, ఎంతపని చేసిన గుర్తింపు, గౌరవం, డబ్బు దక్కని క్షణాలు, మద్యతరగతి కుటుంబంలో ఉండే భయాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయ్. నచ్చిన పని దొరక్క నచ్చని పని చేస్తూ మనస్థాపం చెంద్దిన రోజులు ఎన్నో ఉన్నాయ్. రోజువారీగా ఆడిషన్లకు వెళ్తూ ప్రతిరోజు ఓడిపోయినా క్షణాలు నిన్న మొన్నటిదాకా షరామామూలే. వేరే గొప్ప నటులతో పోలిస్తే నా కష్టాలు, కన్నీళ్లు చాల చిన్నవికావొచ్చు, తీవ్రంగా విశ్లేషిస్తే నావి అసలు కష్టాలు కాకపోవొచ్చు కానీ "లక్కీ" అనే పదం ఎందుకో మింగుడు పడదు, లక్కీ అనడం వల్ల నా కష్టాన్ని శ్రమని చిన్నచూపు చూసినట్టె అవుతుంది. ఇది నా సౌభాగ్యమో లేక వారి మంచితనమో, నా ప్రయాణంలో గొప్ప వ్యక్తులని - కళకారులని కలుసుకోవడం, వారితో పనిచేసే 'అవకాశం' నాకు కలిగింది. నేడు నేను స్టార్ అవ్వలేదు (అవ్వదలుచుకోలేదు కూడాను) కేవలం ఈ 6 ఏళ్ళ పడ్డ కాష్ఠానికి గుర్తింపు వచ్చింది. ఇంకా చేయెల్లసింది చాలానే ఉంది.
ఇదండీ మన కౌశిక్ బాబు మనోగతం. సో, ఇకనుంచైనా జనాలు అతడి అదృష్టాన్ని కాక కష్టాన్ని గుర్తించాలని ఆశిస్తున్నాం!