హోటెల్లో నయనతార బీభత్సం
on Aug 3, 2016
నేనూ రౌడీనే అంటూ ఓ సినిమా చేసింది నయన తార. నిజంగానే నయన తార రౌడీలా బిహేవ్ చేస్తోందట. ఆ విషయం తెలుసా మీకు..?! నయనతార ఎక్కడకు వెళ్లినా సెవెన్ స్టార్, కనీసం ఫైవ్ స్టార్ హోటెల్లో బస కల్పించాల్సిందే. నయనతార లాంటి సెలబ్రెటీ తమ హోటెల్లో అడుగుపెట్టాలని హోటెల్ యాజమాన్యం కలలు కంటుంది. కానీ... ఇక్కడ సీన్ రివర్స్. `నయన తారకు రూమ్ ఇవ్వం` అంటూ ముందే చెప్పేస్తున్నారట. దానికి కారణం ఏమిటి?? నయన తార అంటే అంత భయం ఎందుకు? ఈ విషయాల్లోకెళ్తే.. నయనకు ఫుల్లుగా షార్ట్ టెంపర్ అట. తనకు కొంచెం కోపం వచ్చినా సరే... ఆ స్థాయి ఓ రేంజులో ఉంటుందట. చేతికి అందిన వస్తువుల్ని నేలకేసి కొట్టడం.. తానున్న ప్రదేశాన్ని యుద్ధ భూమిగా మార్చేయడం అలవాటట. నయన హోటెల్ రూమ్ వెకేట్ చేసేటప్పుడు.. సామాన్లన్నీ చిందరపందరగా పడి ఉంటాయట. వాటిని సర్దుకోవడానికి కనీసం రెండు రోజులైనా పడుతుందట. విలువైన వస్తువుల్ని నయన ధ్వంసం చేస్తుందట.
దానికి బిల్లు కట్టినా... మళ్లీ అలాంటి వస్తువుల్ని రిప్లేస్ చేయడం కష్టమవుతుందట. ఒక్కోసారి తలుపు వేసుకొని ఎంతకీ బయటకు రాదట. ఇలాంటి కంప్లెంట్లు నయన బస చేసిన ప్రతీ హోటెల్లోనూ ఎదురవుతున్నాయట. బాబు బంగారం షూటింగ్ ఆమధ్య హైదరాబాద్లో జరిగింది. ఇక్కడ ఓ సెవెన్ స్టార్ హోటెల్లో నయనతార కు రూమ్ బుక్ చేద్దామనుకొన్నారు నిర్మాతలు. అప్పుడే ఈ విషయాలన్నీ బయటకొచ్చాయి. మరో చోట కూడా హోటెల్ యాజమాన్యం నయనకు రూమ్ ఇవ్వడానికి తిరస్కరించిందట. దాంతో చేసేందేంలేక.. నయన చెన్నై వెళ్లిపోయిందట. అమ్మో.. నయనకు ఇంత కోపమా?? ఇలాగైతే కష్టమే సుమీ.