లవర్స్ డే టీజర్... మూతి ముద్దే హైలైట్!
on Feb 7, 2019

ప్రేమికుల రోజున ప్రేక్షకులకు ఫుల్ మిల్స్ గ్యారెంటీ అన్నట్టుంది 'లవర్స్ డే' టీజర్. సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మలయాళ సినిమా 'ఒరు ఆడార్ లవ్' చిత్రానికి తెలుగు అనువాదం ఈ 'లవర్స్ డే'. ఈ రోజుల్లో యువత ఎలా ఉంటున్నారు అనే కథాంశంతో చిత్రం తెరకెక్కింది. బుధవారం సాయంత్రం సినిమా టీజర్ విడుదల చేశారు. ప్రియ ప్రకాష్ వారియర్ సినిమా టీజర్ కావడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. అయితే... అందులో మూతి ముద్దు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. అదే అదే లిప్ లాక్... లవర్స్ డే టీజర్ కి హైలైట్ గా నిలిచింది. అసలే ప్రియ ప్రకాష్... పైగా మూతి ముద్దు తోడయింది. ఈ కారణాల చేత సినిమా చూడాలనుకునే యువతరం సంఖ్య ఎక్కువ అయింది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావడమూ సినిమాకు ప్లస్ అయ్యింది. బొమ్మరిల్లు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో గురురాజ్, వినోద్ రెడ్డి విడుదల చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



