నాని vsపృథ్వీరాజ్ సుకుమారన్?
on Oct 8, 2025

నాచురల్ స్టార్ 'నాని'(Nani)వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు దసరా ఫేమ్ 'శ్రీకాంత్ ఓదెల'(Srikanth Odela)దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' అనే విభిన్నమైన మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండగా, ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తర్వాత 'ఓజి' సుజీత్(Sujeeth)తో మూవీ చేస్తున్నాడు. దీంతో ఈ ఇద్దరి కాంబోపై అంచనాలు ఏ మేర ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.
ఇప్పుడు ఈ మూవీలో మలయాళంలోనే కాకుండా, పాన్ ఇండియా వ్యాప్తంగా స్టార్ డమ్ సంపాదించిన 'పృథ్వీ రాజ్ సుకుమారన్'(Prithviraj Sukumaran)ఒక కీలక పాత్రలో చేయబోతున్నాడనే వార్తలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ మేరకు పృథ్వీరాజ్ సుకుమార్ ని ఒప్పించే ప్రయ్నత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.ప్రతి నాయకుడు క్యారక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. పృథ్వీ రాజ్ సుకుమారన్ స్టార్ హీరోతో పాటు దర్శకుడు కూడా. కథతో పాటు దాని పరిధి విసృతంగా ఉంటేనే ఒక చిత్రానికి కమిట్ అవుతాడు. ఇప్పుడు చేస్తున్న ssmb 29 ,గతంలో చేసిన సలార్ లే ఉదాహరణ. దర్శకుడిగా కూడా రీసెంట్ గా 'ఎల్ 2 ఎంపురాన్' తో పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అందుకున్నాడు.
మరి ఈ నేపథ్యంలో నాని సినిమా కోసం పృథ్వీ రాజ్ సుకుమారన్ ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే, మూవీ ఏ స్థాయిలో తెరకెక్కబోతుందో అర్ధం చేసుకోవచ్చు. సుజిత్ కూడా 'ఓజి' హిట్ తో తన రేంజ్ మరింత పెంచుకున్నాడు. మరి నాని కి విలన్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ చేయడం ఖాయమైతే, పాన్ ఇండియా వ్యాప్తంగా సరికొత్త రికార్డులు నెలకొల్పడం గ్యారంటీ. నీహారిక ఎంటర్ టైన్ మెంట్ పై వెంకట్ బోయినపల్లి భారీ వ్యయంతో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



