స్టార్ హీరో సినిమాలో విలన్ గా మల్లారెడ్డి!
on Oct 8, 2025

దర్శకుడు 'హరీష్ శంకర్'(Harish Shankar)ప్రస్తుతం 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)తో 'ఉస్తాద్ భగత్ సింగ్'(ustaad Bhagat Singh)ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుతున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక హరీష్ శంకర్ చిత్రాల్లో విలన్ చాలా డిఫరెంట్ గా ఉంటాడు. సీరియస్ గా ఉంటూనే కామెడీ ని కూడా పండిస్తాడు. సదరు క్యారక్టర్ ప్రేక్షకులని ఒక సరికొత్త లోకంలో విహరించేలా చేస్తుంది. హరీష్ శంకర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లోని విలన్ రోల్స్ నే ఒక ఉదాహరణ.
రీసెంట్ గా జరిగిన దసరా వేడుకల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర శివారు 'మేడ్చల్' అసెంబ్లీ నియోజకవర్గ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి(Mallareddy)ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన మాట్లాడుతు హరీశ్ శంకర్ తన సినిమాలో నాకు విలన్ క్యారక్టర్ ని ఆఫర్ చేశారు. నన్ను ఒప్పించడానికి మా కాలేజీకి వచ్చి గంటసేపు వెయిట్ చేశాడు. 3 కోట్ల
రూపాయిల పారితోషికం కూడా ఆఫర్ చేశాడు. అయినా నేను ఒప్పుకోలేదు. విలన్‌గా చేస్తే ఇంటర్వెల్‌దాకా నేను హీరోను కొడతా. ఆ తర్వాత హీరో నన్ను కొడతాడు, తిడతాడు’ అంటూ తన స్టైల్లో చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట వైరల్ గా నిలిచాయి.
సంవత్సరం క్రితం కూడా మల్లారెడ్డి ఇదే విషయంపై మాట్లాడుతు పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో విలన్ గా చెయ్యమని హరీష్ శంకర్ అడిగాడు. కానీ చేయనని చెప్పానని మల్లారెడ్డి చెప్పడం జరిగింది. ఒక వేళ మల్లారెడ్డి ఒప్పుకొని ఉంటే సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులకి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ దొరికేది. ఈ విషయంలో ప్రేక్షకులకి అదృష్టం లేదని చెప్పవచ్చు. 'పూలు అమ్మినా పాలు అమ్మినా' డైలాగ్ తో మల్లారెడ్డి పాపులర్ అయిన విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



