భాయ్..అదరగొట్టేసావ్ పో..!!
on Oct 2, 2015
.jpg)
'‘భజరంగి భాయిజాన్’ తో అదిరిపోయే హిట్టిచ్చిన సల్మాన్ ఖాన్..ఇప్పుడు అదే జోష్ తో ‘ప్రేమ్ రతన్ దన్ పాయో’ మూవీ తో మన ముందుకు రాబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే అదరగొట్టిన భాయ్ ఈ సినిమా ట్రైలర్ తో మరింత మెస్మరైజ్ చేశాడు. సూరజ్ సినిమాల్లో ఎప్పుడూ ఉండే విజువల్ గ్రాండియర్ ఈ సినిమాలో ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది.ట్రైలర్ అంతా చాలా కలర్ ఫుల్ గా కనువిందు చేసేలా ఉంది. సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలుండగా.. ట్రైలర్ చూశాక అవి రెట్టింపవడం ఖాయమనే చెప్పాలి. సల్మాన్ సరసన సోనమ్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్, అనుపమ్ ఖేర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సూరజ్ తో ఇంతకుముందు మూడు సినిమాల్లోనూ సల్మాన్ పేరు ప్రేమ్. ఈసారి కూడా సెంటిమెంటుగా హీరోకి అదే పేరు పెట్టాడు సూరజ్. ఈ దీపావళికే సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



