నయన్, రాధిక తరహాలోనే..
on Feb 26, 2021
`సింహా`, `లెజెండ్` వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా `కంచె` భామ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో ప్రగ్య పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. BB3 (వర్కింగ్ టైటిల్)లో ప్రగ్యాది కేవలం పాటలకే పరిమితమైన పాత్ర కాదట. ఓ బిడ్డకు తల్లైన IAS Officer రోల్ లో ఆమె దర్శనమివ్వనుందట. అలాగే.. `సింహా`లో నయనతార, `లెజెండ్`లో రాధికా ఆప్టే తరహాలో `BB3`లో కూడా ప్రగ్యా పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని.. సినిమా హైలైట్స్ లో ప్రగ్యా పాత్ర కూడా ఒకటని టాక్.
మరి.. BB3తో ప్రగ్యా జైశ్వాల్ దశ, దిశ మారుతాయేమో చూడాలి.
యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
Also Read