పవన్ చిత్రంలో ఆడిపాడిన వైజాగ్ బ్యూటీ
on Feb 26, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియడ్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా, ఇందులో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. స్పెషల్ రోల్ లో జాక్వలైన్ ఫెర్నాండేజ్ దర్శనమివ్వనుంది. అలాగే ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ కనిపించనున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథలో భాగంగా ఓ జానపద గీతం వస్తుందట. అందులో.. వైజాగ్ బ్యూటీ పూజిత పొన్నాడ ఆడిపాడిందని సమాచారం. సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అంశాల్లో ఈ ఫోక్ లోర్ సాంగ్ కూడా ఒకటని టాక్. `రంగస్థలం`లో ఆది పినిశెట్టికి జోడీగా నటించిన పూజితకి.. తన కెరీర్ లోనే ఇది అతి పెద్ద ప్రాజెక్ట్ కావడం విశేషం. మరి.. ఈ సినిమా తరువాత పూజిత స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి. 2022 సంక్రాంతికి పవన్ - క్రిష్ కాంబినేషన్ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుందని బజ్.