రేపే ప్రభాస్-మారుతి మూవీ లాంచ్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
on Aug 24, 2022
.webp)
రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్-k' వంటి భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ ల నడుమ ఆయన మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా కమిట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.
ఎందరో స్టార్ డైరెక్టర్స్ తనతో వర్క్ చేయడానికి రెడీగా ఉంటే ప్రభాస్ మాత్రం సుజిత్(సాహో), రాధాకృష్ణ(రాధేశ్యామ్) వంటి కుర్ర దర్శకులకు ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడని ఫ్యాన్స్ ఆనందిస్తున్న సమయంలో అనూహ్యంగా మారుతి ప్రాజెక్ట్ తెరమీదకు వచ్చింది. మారుతి పెద్ద హీరోలను డీల్ చేయలేడనే పేరుంది, పైగా ఇటీవల 'పక్కా కమర్షియల్'తో ఘోర పరాజయాన్ని అందుకున్నాడు. దీంతో మారుతి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ ఆవేదన ప్రభాస్ వరకు చేరలేదనుకుంటా. రేపే ప్రభాస్-మారుతి మూవీ ప్రారంభం కాబోతోంది.
ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్ ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రేపే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారభించబోతున్నారట. ప్రస్తుతం ప్రభాస్ విదేశాలలో ఉండటంతో.. ఆయన లేకుండానే మిగతా మూవీ టీమ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
'ప్రభాస్-మారుతి మూవీ లాంచ్' న్యూస్ పై డార్లింగ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మారుతితో మూవీ అవసరమా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. కొందరైతే ఏకంగా 'బాయ్ కాట్ మారుతి' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఒక్కోసారి ఏ అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. మరి తనని నమ్మి ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ తో మారుతి అలాంటి అద్భుతం ఏదైనా చేస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



