పోసాని అరెస్ట్ కి ఇదే ప్రధాన కారణం..రెడ్ విత్ 3 (5 )
on Feb 27, 2025
.webp)
రచయితగా కెరీర్ ని ప్రారంభించి,ఆ పై దర్శకుడిగా,నటుడుగా తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన హవాని కొనసాగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali).కొన్ని సంవత్సరాల నుంచి సిల్వర్ స్క్రీన్ పై కనపడకపోయినా కూడా తనకి మాత్రమే సాధ్యమయ్యే మేనరిజమ్స్ తో,డైలాగులతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.
కాకపోతే రాజకీయాల్లోకి చేరాక విచక్షణ కోల్పోయి,ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,ఐటి శాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సభ్య సమాజం తలదించుకునేలా నానా దుర్భాషలాడాడు.దీంతో ఏపి వ్యాప్తంగా పోసాని పై పలు ఏరియాల్లో కేసులు నమోదు అయ్యాయి.సినీ పరిశ్రమపై కూడా విమర్శలు చేసాడని,కులాల మధ్య చిచ్చుపెట్టేలా కూడా మాట్లాడాడని, అన్నమయ్య జిల్లా ఓబుల వారి పెళ్లికి చెందిన స్థానికుల ఫిర్యాదు మేరకు 196 ,353 (2 )111 రెడ్ విత్ 3 (5 ) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు.ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పోలీసులు పోసాని నివాసం ఉంటున్న రాయదుర్గం లోని 'మై హోమ్ భూజ' కి చేరుకొని పోసాని ని అరెస్ట్ చేసి,ఈ రోజు ఉదయం ఓబులవారిపల్లెకి తరలించారు.రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.
బాపట్ల, నరసారావు పేట,అనంతపురం,యాదమరి, పుత్తూరు లాంటి ఏరియాల్లో కూడా పోసాని పై కేసులు నమోదయ్యాయి.పోసాని గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



