హాట్ మోడల్‌కి మిడ్నైట్ పోర్న్ వీడియోస్... మెసేజ్‌లు...
on Feb 8, 2020
శృంగారభరిత ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాపులర్ అయిన మోడల్ పూనమ్ పాండే. పాపం మాటలకు ఎప్పుడూ ఫుల్ డ్రస్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయదు. అయితే బికినీల్లో... లేదంటే అందాలు అన్నీ కనిపించేలా ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తుంది. పూనమ్ పాండే పేరు చెప్తే పోర్న్ స్టార్ అని కామెంట్ చేసేవాళ్లూ ఉన్నారు. అటువంటి పూనమ్ పాండే తన ఫోనుకు లెక్కకు మిక్కిలిగా వస్తున్న పోర్న్ ఫొటోస్, వీడియోస్, మెసేజ్‌లతో తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందుకు కారణమైన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది.
అసలు వివరాల్లోకి వెళితే... ఆ మధ్య పూనమ్ పాండే తన పేరుతో యాప్ లాంచ్ చేసింది. గుర్తుందా? అందులో ఎక్స్‌క్లూజివ్ ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేసేది. ఆ యాప్ మైంటైన్ చేసింది రాజ్ కుంద్రా కంపెనీ. ఆ కంపెనీతో రెవెన్యూ షేరింగ్ లో ఏదో తేడా వచ్చి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నానని పూనమ్ చెబుతోంది. ఆమె మాటల ప్రకారం... అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత పూనమ్ పాండే నంబర్ ను యాప్ లో లీక్ చేసి, 'ఫోన్ చేయండి. మీకోసం నేను దుస్తులు విప్పేస్తాను', 'ఫోన్ చేయండి. నేను ఫ్రీగా ఉన్నాను. మీతో మాట్లాడతాను' అని మెసేజ్ లు పెట్టారట. అప్పటినుండి ఎవరెవరో తనకు ఫోన్లు చేస్తున్నారనీ, మిడ్నైట్ పోర్న్ వీడియోస్, మెసేజ్‌లు చేస్తున్నారని పూనమ్ పాండే చెబుతోంది. మధ్యలో ఫోన్ నంబర్ మారిస్తే... కొత్త నంబర్ కూడా యాప్ లో లీక్ చేశారనేది ఆమె చెప్పే మాట. దీనిపై కోర్టులో క్రిమినల్ కేసు కూడా వేసింది.
మరోవైపు రాజ్ కుంద్రా కంపెనీ పూనమ్ పాండే ఆరోపణలను ఖండించింది. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బుల కంటే 60 లక్షలు ఎక్కువ ఇచ్చామని తెలిపింది. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నదని అంటోంది. కోర్టు నుండి లీగల్ నోటీసులు అందలేదని వివరణ ఇచ్చింది.