జరిగిన డ్యామేజ్ చాలు.. నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి
on May 5, 2022

హీరోయిన్స్ పొరపాటున ఎవరైనా పిల్లలతో కలిసి ఫోటో దిగితే చాలు.. ఆ హీరోయిన్ కి పెళ్లి అయిపొయింది, పిల్లలు కూడా ఉన్నారు అంటూ వార్తలు స్టార్ట్ అవుతాయి. తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ విషయంలో కూడా అదే జరిగింది.
రీసెంట్ గా పూనమ్ సోషల్ మీడియాలో ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటో షేర్ చేసి 'హ్యాపీనెస్' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇంకేముంది 'పూనమ్ కి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు.. ఇదిగో సాక్ష్యం' అంటూ కొందరు న్యూస్ రాసేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన పూనమ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ ట్వీట్ చేసింది.

తనకు పెళ్ళై, పిల్లలున్నారు అంటూ వస్తున్న వార్తలపై పూనమ్ స్పందించింది. "నాకు ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ చాలు. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకు థ్యాంక్స్.. దీని ద్వారా ఇలాంటి విషయాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది." అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. అలాగే, నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి అంటూ ట్వీట్ లో పేర్కొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



