చైతు కోసం వస్తానని అంటే ఏమైనా అంటారా!
on Jul 19, 2024

నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం కార్తికేయ 2(karthikeya 2) తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చందు మొండేటి తో తండేల్(thandel)చేస్తున్నాడు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సారి చైతు ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారంటీ అనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల తో పాటు అభిమానుల్లో కూడా ఉంది. ప్రచార చిత్రాలు కూడా అందుకు తగ్గట్టే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా చైతు సినీ కెరీర్ కి సంబంధించిన న్యూస్ ఒకటి అభిమానుల్లో కిక్ ని తెస్తుంది.
సాయి ధరమ్ తేజ్ (sai dharam tej)హీరోగా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకుడు. బ్లాక్ మేజిక్ నేపధ్యానికి ఒక అద్భుతమైన ప్రేమని జోడించి కార్తీక్ నడిపిన విధానం చాలా బాగుంటుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని కూడా అందుకుంది.ఇప్పుడు చైతు తన నెక్స్ట్ మూవీని కార్తీక్ దండు(karthik dandu) డైరెక్షన్ లో చెయ్యబోతున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, ప్రభాస్ ఛత్రపతి, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో వంటి భారీ సినిమాలని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (sri venkateswara cini chithra)నిర్మిస్తుంది. విరూపాక్ష కూడా ఈ సంస్థే నిర్మించింది. తాజా సమాచారం ప్రకారం ఇంకో రెండు నెలల్లో షూటింగ్ కి వెళ్లనుంది. ఇంత వరకు నాగ చైతన్య టచ్ చెయ్యని ఒక డిఫరెంట్ సబ్జెక్టు తో తెరకెక్కబోతుంది.
ఇక నాగచైతన్య కోసం హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే(pooja hegde)రంగంలోకి దిగబోతుందనే వార్తలు వస్తున్నాయి. మేకర్స్ ఆమెని సంప్రదించారని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా అంటున్నారు. ఇదే జరిగితే బుట్ట బొమ్మ మళ్ళీ తెలుగు నాట తన సత్తా చాటడానికి అంకురార్పణ జరిగినట్టే. చైతు, పూజా గతంలో ఒక లైలా కోసం చేసారు. ఇక చైతు డ్యూయల్ రోల్ అని టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



