'ఆయ్', 'కమిటీ కుర్రోళ్ళు' టీమ్స్ మధ్య యుద్ధం!
on Jul 19, 2024

తెలుగు సినీ పరిశ్రమ దినదినాభివృద్ది చెందుతోంది. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను రూపొందించటానికి మన మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా కథ, మేకింగ్ విషయాల్లోనే కాదు, ప్రమోషన్స్ పరంగానూ సినిమాలను వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఆయ్', 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా టీమ్స్ ప్రేక్షకులకు చేరువకావటానికి వినూత్నమైన ప్రమోషనల్ ప్లానింగ్‌ను సిద్ధం చేశాయి.
సినిమా ప్రమోషనల్ ప్లానింగ్‌లో ఇదొక యూనిక్ పాయింట్. 'ఆయ్' సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ చిత్ర యూనిట్ ఆగస్ట్ నెలలోనే రిలీజ్ కానున్న 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా టీమ్‌తో శుక్రవారం క్రికెట్ ఆటలో పోటీ పడనుంది. 'ఆయ్' సినిమా నిర్మాత బన్నీ వాస్.. 'కమిటీ కుర్రోళ్ళు' చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల క్రికెట్ పోటీకి సిద్ధమంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు టీమ్స్ మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బన్నీ వాస్, నిహారిక కొణిదెల మధ్య జరిగిన సరదా చాలెంజ్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బన్నీ వాస్ విసిరిన చాలెంజ్‌ను నిహారిక కొణిదెల స్వీకరించారు. కచ్చితంగా ఆయ్ టీమ్ మీద తమ కమిటీ కుర్రోళ్ళు టీమ్ విజయం సాధిస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు.
జూలై 19 సాయంత్రం ఆరు గంటలకు జరగబోయే మ్యాచ్‌లో గెలుపు మాదంటే మాది అంటూ సాగిన చిట్ చాట్ సరదాగా ఉంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఈ రెండు సినిమాలు గోదావరి బ్యాక్ డ్రాప్‌తోనే తెరకెక్కాయి. క్రికెట్, మూవీ లవర్స్‌ను ఈ మ్యాచ్ ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు.
ఆయ్ సినిమా గురించి:
నార్నే నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య తదితరులు ఇందులో ప్రధాన తారాగణంగా నటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించి:
నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతోన్న కమిటీ కుర్రోళ్ళు చిత్రం సినీ ప్రేక్షకుల హృదయాలను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమా కూడా ఆగస్ట్‌లోనే రిలీజ్ కానుంది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఐశ్వర్య రచిరాజు, మణికాంత పరుశు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావ్, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు సినిమాలో నటించారు. యదు వంశీ దరక్శకత్వంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



