20 నిమిషాలకి అక్షరాలా కోటి?
on Jan 27, 2021
.jpg)
ప్రస్తుతం తెలుగునాట వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. మహర్షి, గద్దలకొండ గణేష్, అరవింద సమేత, అల వైకుంఠపురములో.. ఇలా ఈ మధ్య ఈ బుట్టబొమ్మ నటించిన ప్రతీ బొమ్మ బ్లాక్ బస్టరే. రైట్ నౌ రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాలతో బిజీగా ఉన్న పూజ.. తాజాగా ఆచార్య చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మల్టిస్టారర్ లో చరణ్ కి జంటగా పూజా హెగ్డే కనిపిస్తారని సమాచారం.
అంతేకాదు.. 20 నిమిషాల పాటు సాగే ఈ క్యారెక్టర్ కోసం ఏకంగా కోటి రూపాయిల పారితోషికం అందుకుంటున్నారట. ఫుల్ లెన్త్ రోల్ కోసం దాదాపు మూడు కోట్ల రూపాయిల మొత్తం డిమాండ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మకి.. ప్రజెంట్ ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మొత్తం ఎక్కవైతే కాదనే చెప్పాలి. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. త్వరలోనే ఆచార్యలో పూజాహెగ్డే ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



