ప్రభాస్ దగ్గరకు పూజా హెగ్డే కూడా వెళ్ళింది!
on Mar 13, 2020

కరోనా వైరస్ విశ్వవ్యాప్తంగా బెంబేలెత్తిస్తున్న కారణంగా తమ షూటింగులను చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. ఇక, విదేశాలకు విహార యాత్రలకు వెళ్లాలనుకున్న వారు తమ తమ పర్యటలను రద్దు చేసుకున్నారు. విదేశాలకు వెళ్లి షూటింగ్ చేయాలనుకునే ఆలోచనను పొరపాటున ఎవరు మనసులోకి రానివ్వడం లేదు. ప్రభాస్ మాత్రం ఎటువంటి భయాందోళనలు లేకుండా జార్జియాలో చక్కగా షూటింగ్ చేస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రీకరణ గత కొన్ని రోజులుగా జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్ననే ఒక ఫైట్ తీశారు. ఈ వీకెండ్ నుండి హీరోహీరోయిన్లపై రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ప్రభాస్ దగ్గరకు పూజా హెగ్డే కూడా వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఆమె జార్జియాలో ల్యాండ్ అయ్యారు. కరోనా వైరస్ కారణంగా ముఖానికి మాస్కు ధరించి, తగు జాగ్రత్తలు తీసుకుని పూజా హెగ్డే విమాన ప్రయాణం చేశారు. సినిమాలపై ప్రేమతో తాను ఇలా చేస్తుంటానని పూజా హెగ్డే పేర్కొన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



