తెలుగులో హిట్ దిశగా 'పొన్నియన్ సెల్వన్'!
on Oct 2, 2022

టాక్ తో సంబంధం లేకుండా తెలుగులో ఇతర భాషల భారీ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల విడుదలైన హిందీ ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర పార్ట్-1' డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ తెలుగులో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ సినిమా 'పొన్నియన్ సెల్వన్-1' కూడా అదే బాటలో పయనిస్తోంది.
భారీ తారాగణంతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన 'పొన్నియన్ సెల్వన్-1' సెప్టెంబర్ 30న విడుదలై తమిళ్ లో తప్ప మిగతా భాషల్లో డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో 'పొన్నియన్ సెల్వన్' పాజిటివ్ టాక్ రాకపోవడం పట్ల తమిళ్ వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే టాక్ లు, విమర్శలు పక్కన పెడితే ఈ చిత్రం తెలుగులో చెప్పుకోదగ్గ వసూళ్లే రాబడుతోంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల బిజినెస్ చేసిన 'పొన్నియన్ సెల్వన్-1'.. మొదటి రోజు రూ.2.88 కోట్ల షేర్, రెండో రోజు రూ.2.30 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో రూ.5.18 కోట్ల షేర్(9.80 కోట్ల గ్రాస్) రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.5 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. అక్టోబర్ 5 దాకా బాక్సాఫీస్ పోటీ లేకపోవడం, పైగా ఇప్పుడు దసరా సెలవలు కావడంతో.. ఈ మూడు రోజుల్లో 'పొన్నియన్ సెల్వన్-1' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



