'పొన్నియన్ సెల్వన్' టీజర్.. తమిళ 'బాహుబలి' అవుతుందా?
on Jul 8, 2022

తెలుగు నుంచి వచ్చిన 'బాహుబలి' ఫ్రాంచైజ్, కన్నడ నుంచి వచ్చిన 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ నేషనల్ వైడ్ గా సత్తా చాటి సంచలనం సృష్టించాయి. ఇప్పుడు తమిళ్ నుంచి వస్తున్న 'పొన్నియన్ సెల్వన్' ఫ్రాంచైజ్ కూడా ఆ రేంజ్ లో సత్తా చాటే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా 'పొన్నియన్ సెల్వన్' పార్ట్-1 టీజర్ విడుదలైంది.
చోళులు వస్తున్నారు అంటూ రిలీజ్ చేసిన 'పొన్నియన్ సెల్వన్' పార్ట్-1 టీజర్ గ్రాండ్ విజువల్స్, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. "ఈ గాలి, పాట, రక్తం, పోరాటం.. అంతా మరిచిపోటానికే.. ఆమెని మర్చిపోటానికి, నన్ను నేనే మర్చిపోటానికి" అంటూ సాగే డైలాగ్ తో టీజర్ ఆసక్తికరంగా ఉంది. భారీ యుద్ధ సన్నివేశాలతో బాహుబలిని గుర్తు చేసేలా టీజర్ ఉంది. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ఇలా ఎందరో స్టార్ కాస్ట్ ఉండటం మరింత ప్లస్ అయింది. ఇక రవి వర్మన్ సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ టాప్ క్లాస్ లో ఉన్నాయి.
కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



