కత్తి మహేష్ పై కేసు.. అరెస్ట్ తప్పదా?
on Jun 30, 2018

కత్తి మహేష్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అనే భావన చాలామందిలో ఉంది.. ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్, బిగ్ బాస్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యారు.. తర్వాత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసి, పవన్ ఫ్యాన్స్ తో గొడవపడి ఫేమస్ అయ్యారు.. మూడు వివాదాలు, ఆరు విమర్శలుతో సాగిపోయిన మహేష్ ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారనే చెప్పాలి.. అయితే తాజాగా మరోసారి ఆయన పేరు తెరమీదకు వచ్చింది.. ఓ టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న మహేష్, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసారు.. ‘రామాయణం అనేది నాకొక కథ..
రాముడు అనేవాడు ఎంత ఆదర్శవంతుడో..అంత దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో రావణుడితో సీత ఉంటేనే న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా' అంటూ మహేష్ వ్యాఖ్యలు చేసారు.. ఈ వ్యాఖ్యల పట్ల హిందూ జనశక్తి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలని కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కత్తి మహేష్ పై కేసు నమోదు చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



