మరోసారి సావిత్రిగా కీర్తిసురేష్...!
on Jul 2, 2018

మహానటి సినిమా వరకూ కీర్తిసురేష్ నటన గురించి పెద్దగా అంచనాలు లేవు. చూడ్డానికి బాగుంటుందే కానీ నటన రాదని పెదవి విరిచినవాళ్లూ లేకపోలేదు. అందుకనే ఆమెను సావిత్రి పాత్ర కోసం ఎంచుకున్నారంటే తెగ అనుమానపడిపోయారు. కానీ మహానటిలో కీర్తి తానేమిటో నిరూపించేసుకుంది. సావిత్రి పాత్రని మళ్లీ తాను తప్ప మరెవ్వరూ చేయలేనంతగా ఒదిగిపోయింది. ఆ తర్వాత మహానటిలాంటి పాత్రలు కీర్తిని చాలానే పలకరించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పాత్రను చయమన్న ఆఫరూ వచ్చింది. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుందో ఏమో... ఇక మీదట తాను బయోపిక్స్‌లో నటించేది లేదని తేల్చిచెప్పేసింది కీర్తి. కానీ మరోసారి కీర్తిని ఓ బయోపిక్‌లో చూసే అవకాశం ఉందంటున్నారు. అది కూడా సావిత్రి పాత్రలోనే. బాలకృష్ణ తలపెట్టిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో సావిత్రి పాత్ర కోసం దర్శకుడు క్రిష్ కీర్తినే సంప్రదించారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



