ENGLISH | TELUGU  

అసలేముందిరా ఈ సినిమాలో.. ఇంతలా లేపారు!

on Apr 15, 2024

కొంతకాలంగా మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మొన్నటి వరకు ఓటీటీలలో మలయాళ సినిమాలను చూసిన తెలుగు ఆడియన్స్.. ఇప్పుడు థియేటర్లలోనూ చూసి ఆనందిస్తున్నారు. ఇటీవల మలయాళ చిత్రం 'ప్రేమలు' తెలుగునాట మంచి ఆదరణ పొందింది.

రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ గా రూపొందిన 'ప్రేమలు' మూవీ ఫిబ్రవరిలో విడుదల కాగా.. రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మార్చిలో తెలుగులో విడుదల కాగా.. ఇక్కడ కూడా మంచి వసూళ్లతో ఘన విజయం సాధించింది. ఇక ఇటీవల ఏప్రిల్ 12న ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. అయితే థియేటర్లలో చూడకుండా నేరుగా ఓటీటీలో చూసిన వారిలో కొందరు.. ఈ సినిమాని ఓవర్ రేటెడ్ అని అంటున్నారు. అందరూ చెప్పినంత స్థాయిలో ఈ సినిమా లేదని, ఇంతకంటే బెటర్ రొమాంటిక్ కామెడీ సినిమాలు తెలుగులో ఎన్నో వచ్చాయని అభిప్రాయపడుతున్నారు. ఇంకా కొందరైతే "అసలేముందిరా ఇందులో.. ఇంతలా లేపారు" అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇదొక క్యూట్ ఫిల్మ్ అని, ఇందులో రైటింగ్ చాలా బాగుందని వెనకేసుకొస్తున్నారు. మొత్తానికైతే థియేటర్లలో అందరి నుంచి ప్రశంసలు అందుకున్న ప్రేమలు.. ఓటీటీలో మాత్రం మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంటోంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.