మహేష్ ని అభినందిస్తూ పవన్ స్పెషల్ బర్త్ డే విషెస్
on Aug 9, 2022
.webp)
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మహేష్ కి విషెస్ తెలిపారు.
"ప్రముఖ కథానాయకులు మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. 'అర్జున్' సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచాం. 'జల్సా' సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

"ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత
శక్తి ని, సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా మహేష్ కి విషెస్ తెలిపారు. ''హ్యాపీ బర్త్ డే మహేష్ అన్న" అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



