`చిత్రలహరి` టీమ్ ని అభినందించిన పవర్ స్టార్!!
on Apr 17, 2019

ఎలక్షన్స్ వర్క్ లో ఇన్ని రోజులు బిజీ బిజీగా గడిపాడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. ఇక ఎలక్షన్స్ ముగియడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. తను ఎంతో ఇష్టపడే మేనల్లుడు సినిమా `చిత్రలహరి` చూసి ఆ టీమ్ ని అభినందిస్తూ ప్లవర్ బొకేలను పంపించాడు. సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్) నిర్మించిన చిత్రం `చిత్రలహరి`. ఏప్రిల్ 12న విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమా చూసిన వారందరూ యూనిట్‌ను అప్రిషియేట్ చేశారు.
ఇటీవల సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి, సాయితేజ్, నిర్మాతలు, దర్శకుడ్ని అభినందిస్తూ ఓ వీడియో సందేశం పంపిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమాను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చడంతో యూనిట్‌ను అభినందిస్తూ చిత్ర యూనిట్‌కు ఫ్లవర్ బొకెలను పంపారు. `కంగ్రాట్స్ .. మీ వర్క్‌ను నేను ఎంతో బాగా ఎంజాయ్ చేశాను` అంటూ మెసేజ్ కూడా పంపారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



