వెంకటేష్ రాజకీయ ప్రచారం!
on Apr 17, 2019

ఇటు తెలంగాణ... అటు ఆంధ్ర ప్రదేశ్... రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఫలితాల కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో విక్టరీ వెంకటేష్ రాజకీయ ప్రచారం ప్రారంభించారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి ఎవరికైనా మద్దతు ఇస్తున్నారా అని ఆలోచించవద్దు. ఆయన చేస్తున్న ప్రచారం సినిమా కోసం! మేనల్లుడు అక్కినేని నాగ చైతన్య తో కలిసి వెంకటేష్ నటిస్తున్న సినిమా 'వెంకీ మామ'. ఇందులో రాజకీయ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉన్నాయి. వెంకీ మామ బహిరంగ సభ పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఆ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వందల మంది జూనియర్ ఆర్టిస్టులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సినిమాలో రాజకీయ హడావిడి ఎలా ఉంటుందో మరి!! మొన్నటి వరకు రాజమండ్రిలో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర దర్శకుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



