బజ్: పవన్, చరణ్‌తో శంకర్ చిత్రం?
on Jan 18, 2021
ఆర్ ఆర్ ఆర్, ఆచార్య తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో మల్టిస్టారర్ చేయబోతున్నారంటూ గత కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ లో యంగ్ టైగర్ యన్టీఆర్ తో, ఆచార్యలో తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న చరణ్.. తదుపరి చిత్రం కోసం తన బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలసి నటించబోతున్నారన్నదే ఆ కథనాల సారాంశం.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. పవన్, చరణ్ కాంబినేషన్ లో రానున్న సినిమాని సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించబోతున్నారట. లోకనాయకుడు కమల్ హాసన్ తో చేస్తున్న ఇండియన్ 2కి.. కమల్ రాజకీయ వ్యవహారాల వల్ల బ్రేక్ పడడంతో ఈ గ్యాప్ లో గ్రాఫిక్స్ కి స్కోప్ లేని ఓ భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేశారట శంకర్. జెంటిల్ మేన్, భారతీయుడు తరహాలో కథాబలమున్న సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుందట. ఓ బడా నిర్మాత ఈ చిత్రాన్ని సెట్ చేస్తున్నారని టాక్. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.
ప్రస్తుతం పవన్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్, క్రిష్ డైరెక్టోరియల్ చేస్తున్నారు. అలాగే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ సినిమాలు చేయాల్సి ఉంది.
త్వరలోనే పవన్, చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.