లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్.. షూటింగ్ ఎప్పుడంటే..?
on Oct 19, 2025

ఇటీవల 'ఓజీ'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ విజయం మరిన్ని సినిమాలు చేయాలనే ఉత్సాహాన్ని పవన్ కళ్యాణ్ లో నింపింది. పవన్ అభిమానులు కూడా ఆయన రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సినిమాలకు పూర్తిగా దూరం కావొద్దని కోరుతున్నారు. (Pawan Kalyan)
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫిల్మ్ ఉంది. దీనిని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ 'ఓజీ-2' చేస్తానని మాట ఇచ్చారు. అయితే అంతకన్నా ముందు మరో రెండు సినిమాలు చేసే అవకాశముంది అంటున్నారు.
పవన్ కళ్యాణ్ గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాతగా ఒక సినిమా ప్రకటించారు. అయితే పవన్ ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టడంతో.. ఇక సినిమాలు చేయరని, 'ఉస్తాద్ భగత్ సింగ్' చివరి చిత్రమని ప్రచారం జరిగింది. కానీ, సురేందర్ రెడ్డి సినిమా చేసే ఆలోచనలో పవన్ ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నారని సమాచారం. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారని న్యూస్ వినిపిస్తోంది.
'ఓజీ'లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ కి, ఎలివేషన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలాంటిది లోకేష్ సినిమాల్లో ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఆ సీన్స్ పవన్ కళ్యాణ్ కి పడితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే పవన్-లోకేష్ కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. లోకేష్ తక్కువ రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తుంటాడు. అందుకే ఈ సినిమాకి పవన్ డేట్స్ ఇవ్వడం దాదాపు ఖాయమనే మాట వినిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



