త్రివిక్రమ్ అన్న మాటకి ఎంతో ఏడ్చాను!
on Oct 19, 2025

'అ ఆ' అనే మూవీ పేరు వింటే చాలు ముందు నితిన్ తర్వాత సమంత ఆ తర్వాత హరితేజ రోల్స్ గుర్తొస్తాయి. హీరోయిన్ తర్వాత అంత మంచి పేరు తెచ్చుకున్న రోల్ హరితేజది. ఐతే రీసెంట్ గా ఈ రోల్ గురించి హరితేజ కొన్ని విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.
"ఈ మూవీలో నా రోల్ కి ఎవరు సరిపోతారా అని వెతుకుతూ ఉండగా ఏదో టీవీ షో చూస్తూ ఒక కుకరీ షో దగ్గర పాజ్ చేశారట. నేను వేసే జోకులు, నేను చేసే ఫన్ ఆ వంటల మీద వంకాయల మీద జోక్స్ చూసి ఈ అమ్మాయిని తీసుకురండి అన్నారట. త్రివిక్రమ్ సినిమా అంటూ నాకు ఫోన్ వచ్చేసరికి నా లైఫ్ మొత్తం పాజ్ ఐపోయినట్టుగా అనిపించింది. వెళ్లాను ఒక్కసారే ఆడిషన్ చేశారు. బాగుందో లేదో కూడా చెప్పలేదు. వారం పది రోజులు ఐపోయింది. మనకెప్పుడూ దరిద్రం బెస్ట్ ఫ్రెండ్, పక్కనే ఉంటుంది కదా.. ఆఫర్ మిస్ అయింది అనుకున్నాను. ఐతే ఆ తర్వాత డైరెక్ట్ గా ఒక మూడు నెలలకు డేట్స్ వచ్చాయి. నాకు క్యారెక్టర్ తెలీదు. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇదేదో చాలా పెద్ద మ్యాటరే అని.
ఐతే త్రివిక్రమ్ గారు నాకు విషయం అంతా చెప్పలేదు. నాకు మొత్తం చెప్పేస్తే టూ మచ్ బర్డెన్ తో యాక్టింగ్ సరిగా రాదు అని. ఆ తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక నాకు సక్సెస్ గురించి తెలిసింది. ఎక్కడికి వెళ్లినా ఈ మూవీ గురించే మాట్లాడేవాళ్ళు. ఈ మూవీ స్టేజి మీద త్రివిక్రమ్ గారు నన్ను పరిచయం చేస్తూ ఈమె యంగ్ సూర్యకాంతం అంటూ పొగిడారు. ఆరోజు నాకు నిద్ర పట్టలేదు. ఎంత ఏడ్చానో, ఎంత నవ్వానో నాకే తెలీదు. ఎం చేయాలో కూడా నాకే తెలీదు."అని చెప్పింది.
అప్పట్లో ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇంతా అని అడిగేసరికి "రోజుకు ఐదు వేలు తీసుకున్న. సీరియల్స్ మానేసే టైములో రోజుకు 12 - 13 మధ్య తీసుకున్నా ఐదారేళ్లకు ముందు" అని చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



