తెలుగు లెక్చరర్ గా పవన్.. ఇంగ్లీష్ లెక్చరర్ గా పూజ..!?
on Mar 16, 2022
.webp)
`గబ్బర్ సింగ్` (2012) వంటి సంచలన చిత్రం అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ కెప్టెన్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `భవదీయుడు భగత్ సింగ్` పేరుతో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ కి.. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది.
Also Read: అఖిల్ బర్త్ డేకి `ఏజెంట్` సర్ప్రైజ్!?
ఇదిలా ఉంటే, ఇందులో పవన్ కి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైందని సమాచారం. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `భవదీయుడు భగత్ సింగ్`లో పవన్ కళ్యాణ్ తెలుగు లెక్చరర్ గా కనిపించనుండగా.. పూజా హెగ్డే ఏమో ఇంగ్లిష్ లెక్చరర్ రోల్ లో దర్శనమివ్వనుందట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కాగా, ఈ సినిమాలో `మీర్జాపూర్` సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



