`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో హీరోగా `మోస్ట్ వాంటెడ్` ఫస్ట్ సక్సెస్ ని అందుకున్నాడు అక్కినేని బుల్లోడు అఖిల్. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు.. `ఏజెంట్` పేరుతో ఓ స్పై థ్రిల్లర్ చేస్తున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ఈ ఏడాది ఆగస్టు 12న థియేటర్స్ లో వినోదాలు పంచనుంది.

ఇదిలా ఉంటే, ఏప్రిల్ 8 అఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసిందట. అందులో భాగంగా.. ఏప్రిల్ 8న `ఏజెంట్` తాలుకు ఫస్ట్ గ్లింప్స్ లేదా టీజర్ ని రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయట. అక్కినేని అభిమానులను అలరించేలా అందులో అఖిల్ విజువల్స్ ఉంటాయని సమాచారం. త్వరలోనే `ఏజెంట్` నుంచి అఖిల్ బర్త్ డే సర్ప్రైజ్ పై క్లారిటీ రానుంది.
Also Read: కందికొండ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు సిద్ధం
కాగా, `ఏజెంట్`లో అఖిల్ కి జంటగా నూతన కథానాయిక సాక్షి వైద్య నటిస్తోంది. హిప్ హాప్ తమిళ బాణీలు అందిస్తున్న ఈ సినిమాకి రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు.







