రేపే పవన్ గబ్బర్ సింగ్ 2
on Feb 20, 2014

"అత్తారింటికి దారేది" చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ రేపు (ఫిబ్రవరి 21) ముహూర్తపు కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులతో పాటుగా పవన్ కి సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి "గబ్బర్ సింగ్ 2" అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ ఈ సినిమా కథ పూర్తిగా వేరని, గబ్బర్ సింగ్ 2 సినిమాకు సీక్వెల్ కాదని చిత్ర దర్శకుడు సంపత్ నంది చెబుతున్నాడు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే తదితర విషయాలు రేపు తెలియనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



