చిరు బర్త్ డే పవన్ హంగామా
on Aug 23, 2015
.jpg)
గత కొంతకాలంగా మెగా వేడుకలకు దూరంగా వుంటున్న పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారాడు. మధ్యాహ్నమే చిరు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పొచ్చాడు పవన్. ఆ తర్వాత పార్క్ హయత్ లో జరిగిన పార్టీకి కూడా హాజరయ్యాడు.తన మిత్రులు త్రివిక్రమ్ శరత్ మరార్ తో కలిసి పవన్ కళ్యాణ్ మెగా వేడుకకి హాజరయ్యాడు. స్వయంగా కారును డ్రైవ్ చేసుకొంటూ ఆయన వేడుకకి వచ్చాడట. పార్టీలోకి ఎంట్రీ కాగానే నేరుగా అన్నయ్య వదినల దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పాడట. పవన్ కనిపించగానే.. `మా హీరో వచ్చాడు` అంటూ చిరంజీవి ఆత్మీయంగా దగ్గరకి తీసుకొన్నాడట. ఆ తర్వాత పార్టీకి హాజరైన ప్రముఖులందరి దగ్గరికి వెళ్లి పవన్ పలకరించాడట. దాదాపుగా పార్టీ పూర్తయ్యేవరకు పవన్ అక్కడే గడిపాడట. కుటుంబ సభ్యులతోనూ అతిథులతోనూ పవన్ కళ్యాణ్ కలిసిపోయిన విధానం చూసి చిరంజీవి చాలా ఆనందపడ్డారట. మొత్తానికి పవన్ కళ్యాణ్ మెగా వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



