'కిక్ 2'ను 20నిమిషాలు కత్తెరించారు
on Aug 22, 2015
.jpg)
మాస్ మహారాజ్ రవితేజ కిక్ 2 సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ తో పాటు సినీ విమర్శకుల నుంచి కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ వెంటనే యాక్టివ్ అయి 20నిమిషాల నిడివి కట్ చేసి రీరిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు ద్వితీయార్థంలో సినిమా లెంత్ తగ్గి స్క్రీన్ ప్లే గ్రిప్ పెరిగిందని అంటున్నారు. మాస్ మహారాజ్ స్టయిల్ కి తగ్గట్టే మాస్ ఎలిమెంట్స్ యాక్షన్ మిక్స్ చేసి సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బిలాస్ పూర్ నేపథ్యంలో లొకేషన్లు రకూల్ గ్లామర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అన్న టాక్ వచ్చింది. రేసుగుర్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది కావడంతో తొలిరోజు ఓపెనింగులు అదిరిపోయాయని రిపోర్ట్ వచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



