అప్పుడు ‘ఆ నలుగురు’.. ఇప్పుడు ‘ఆటగదరా శివ’
on Jul 6, 2017
‘ఆటగదరా శివ...’అనగానే టక్కున గుర్తొచ్చేది తనికెళ్ల భరణి. ఆయన రాసిన శివ స్తుతిలోని తొలి లైన్ అది. ఆ విధంగా తెలుగు నాట బాగా పాపులర్ అయిన పదం ‘ఆటగదరా శివ’. ఇప్పుడు ఆ పదమే టైటిల్ గా.. సినిమా రానుంది. చంద్ర సిద్ధార్థ్ దర్శకుడు. తన ప్రతి సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు చంద్రసిద్ధార్థ్. ఆ నలుగురు, అందరి బంధువయ.. చిత్రాలు అందుకు నిదర్శనాలు. దర్శకుడిగా ఆయనది విభిన్న శైలి. ఇప్పుడు తాను చేస్తున్న సినిమాకు ‘ఆటగదరా శివ’అని నామకరణం చేశారు. ఆధ్యాత్మికత, వైరాగ్యంతో కూడిన ఈ టైటిల్ ని తన కథకు ఎంచుకున్నారంటే... ఇది ఖచ్ఛితంగా ‘ఆ నలుగురు’స్థాయి సినిమా అయ్యుండాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. వెయిట్ అండ్ సీ.