ఈ పాండవుల నవ్వులేంది బాబోయ్..!
on Jan 31, 2014
మంచు ఫ్యామిలీ అంతా కలిసి నటించిన "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రం నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో? జనాలు ఈ సినిమా గురించి ఎలా అనుకుంటున్నారో ఒకసారి చూద్దామా..!
కథలోకి వెళితే...
బ్యాంకాక్ లో టూరిస్ట్ గైడ్ పనిచేస్తుంటాడు నాయుడు(మోహన్ బాబు). ఇతనికి ముగ్గురు కొడుకులు (మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్). ఇదే బ్యాంకాక్ లో ఓ రెస్టారెంట్ బిజినెస్ చేస్తుంటుంది సత్య (రవీనాటాండన్). ఈమెకు ఇద్దరు కొడుకులు(విష్ణు, వెన్నెల కిషోర్). అయితే గతంలోనాయుడు,సత్యలు ప్రేమించుకొని, కొన్ని కారణాల వలన విడిపోతారు. సత్య ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్న హనీ(హన్సిక)ని విష్ణు(విజయ్) ప్రేమిస్తాడు. అయితే సత్య, నాయుడుల ప్రేమకథ తెలుసుకున్న హనీ.. వీరిద్దరికీ పెళ్లి చేసి, తర్వాత అందరిని ఒకే ఇంట్లోకి తీసుకొస్తుంది. సత్య, నాయుడుల కొడుకులకు ఒకరితో ఒకరు గొడవ పడుతుంటారు. తర్వాత అందరు కలిసిపోతారు. ఇంతలోనే హనీని ఓ గ్యాంగ్ వచ్చి బలవంతంగా తీసుకుపోతుంది. అసలు హనీ ఎవరు? హనీ కోసం నాయుడు కుటుంబం ఏం చేసారు? అనేది మిగిలిన కథ.
కథనం :
కథ మనకు తెలిసినట్లుగానే అనిపించినప్పటికీ కథనం చాలా కొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీవాస్. శ్రీవాస్ తన రచయితలకు బాగా పని చెప్పి నవ్వులతో కూడిన కథ సిద్ధం చేసుకొని, కథనం పరంగా అద్భుతంగా తెరకెక్కించి విజయం దక్కించుకున్నాడు అనే చెప్పుకోవాలి. ఈ చిత్రంలో మోహన్ బాబు డైలాగులు అభిమానులను అలరించాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ మోహన్ బాబు పంచ్ డైలాగులు అదరగొట్టాయి. విష్ణు, వెన్నెల కిషోర్, తనీష్ లు వారి వారి పాత్రలకు న్యాయం చేసి, ప్రేక్షకులకు నవ్వుల విందును పంచారు. ఇక మనోజ్ కత్తిలాంటి లేడి గెటప్ లో అలరించాడు. హీరోయిన్ల గ్లామర్ సినిమాకు ప్రధానాకర్షణగా చెప్పుకోవచ్చు.
ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... డబ్బులు పెట్టి టికెట్టు కొనుక్కొని సినిమాకు వెళ్ళిన ప్రతిఒక్కరికి కూడా సంతోషంగా కడుపుబ్బ నవ్వుకున్నాం అనే అనుభూతి కలుగుతుంది అని చెప్పొచ్చు.