War 2 vs Coolie: ట్రైలర్ దెబ్బకి అంచనాలు తారుమారు!
on Aug 3, 2025

ఈ ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. ఒకటి 'వార్-2' కాగా, మరొకటి 'కూలీ'. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓవరాల్ హైప్ ని పక్కన పెడితే.. సౌత్ లో మాత్రం 'వార్-2' కంటే 'కూలీ' ముందు ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ట్రైలర్ విడుదల తర్వాత ఒక్కసారిగా అది రివర్స్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'కూలీ'. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి స్టార్స్ ఇందులో భాగమయ్యారు. దీంతో 'కూలీ'పై మొదటి నుంచి అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో తాజాగా విడుదలైన ట్రైలర్ ఫెయిల్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రీసెంట్ గా వచ్చిన 'కూలీ' ట్రైలర్ ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ట్రైలర్ రెగ్యులర్ గా ఉందని, అంతమంది స్టార్స్ ఉన్నా వావ్ మూమెంట్స్ లేవని అంటున్నారు. కొందరు మాత్రం సినిమాలోని కంటెంట్ రివీల్ చేయకుండా లోకేష్ కావాలని ఇలా ట్రైలర్ కట్ చేయించి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా 'కూలీ' ట్రైలర్ కి ఓ రేంజ్ రెస్పాన్స్ రాకపోవడం 'వార్-2'కి కలిసొచ్చే అవకాశముంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'వార్-2'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టీజర్ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. కొద్దిరోజులు క్రితం విడుదలైన ట్రైలర్ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు 'కూలీ' ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో.. 'వార్-2'పై అందరి దృష్టి మరింతగా పడుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



