హనుమంతుడు చెవిటివాడా?.. వివాదాస్పదంగా మారిన ఓం రౌత్ ట్వీట్!
on Jun 17, 2023

'ఆదిపురుష్' సినిమా దర్శకుడు ఓం రౌత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో తిరుమల దేవస్థాన ప్రాంగణంలో హీరోయిన్ కృతి సనన్ ని ఓం రౌత్ హత్తుకొని ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. ఇక నిన్న(జూన్ 16) 'ఆదిపురుష్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓపెనింగ్స్ అయితే రికార్డు స్థాయిలో వచ్చాయి కానీ, రామాయణాన్ని వక్రీకరించారంటూ దర్శకుడు ఓం రౌత్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నాడు.
ఎప్పుడో 2015 లో హనుమాన్ జయంతి రోజున ఓం రౌత్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఆయనను వివాదంలోకి నెట్టింది. "హనుమంతుడు చెవిటివాడా? మా బిల్డింగ్ చుట్టుపక్కల ప్రజలు అలాగే అనుకుంటున్నారు. హనుమాన్ జయంతి రోజున బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేస్తున్నారు" అంటూ అప్పట్లో ఓం రౌత్ ట్వీట్ చేశాడు. పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డట్లుగా ఇప్పుడు ఆ ట్వీట్ నెటిజన్ల కంటపడటంతో.. ఒక్కసారిగా వైరల్ గా మారింది. "ఇది హనుమంతుడిపై ఓం రౌత్ కి ఉన్న గౌరవం?.. అతను రామాయణాన్ని నిజంగా భక్తితో, బాధ్యతతో తెరకెక్కించలేదు.. అందుకే ఆదిపురుష్ అలా ఉంది" అంటూ పలువురు నెటిజన్లు ఓం రౌత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



