విక్రమ్ కోసం మాళవిక మరో 20 రోజులు చెన్నైలోనే!
on Jun 18, 2023

చియాన్ విక్రమ్ ఇప్పుడు ఫుల్ హెక్టిక్‌గా ఉన్నారు. తంగలాన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా తంగలాన్. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ మొదలైంది. కానీ రిహార్సల్స్ చేస్తుండగా చియాన్‌కి గాయాలయ్యాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ ని హాల్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ షెడ్యూల్ మొదలుపెట్టినట్టు సమాచారం.
గతంలో పా.రంజిత్ మాట్లాడుతూ "జూన్ 15 తర్వాత షూటింగ్ మొదలుపెడతాం. ఇంకో 12 రోజులు షూటింగ్ చేస్తే షెడ్యూల్ పూర్తవుతుంది" అని అన్నారు. ఆ మాట ప్రకారం తాజాగా చెన్నైలో షూటింగ్ మొదలుపెట్టారు. చియాన్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఈ సారి పూర్తి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేద్దామని టీమ్‌తో చెప్పారట. చియాన్‌కి తగ్గట్టు మాళవిక మోహనన్ కూడా కాల్షీట్ అడ్జస్ట్ చేశారట.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు మాళవిక మోహనన్. ఇప్పుడు ఆమె చెన్నైలో ఉన్నట్టు అనౌన్స్ చేశారు. చెన్నైలో మరో 20 రోజుల పాటు ఉంటానని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఇంకో 20 రోజుల పాటు తంగలాన్ షెడ్యూల్ చెన్నైలో జరుగుతుంది.
ఆదివారాలు, ఇతరత్రా కొన్ని రోజులు తీసేస్తే ఈ షెడ్యూల్ లెక్క పా.రంజిత్ ఇంతకు ముందు చెప్పిన లెక్కతో సరిపోతుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది తంగలాన్. విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి, డేనియల్, హరి కృష్ణన్ తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాను విడుదల చేయడానికి ముందే అన్నీ ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపాలన్న ఉద్దేశంతో ఉన్నారు మేకర్స్. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్,ది మేగ్నమ్ ఆపస్ ఫ్లిక్ నిర్మిస్తున్నాయి. 2024 ఫస్టాఫ్‌లో విడుదల చేయాలన్నది ప్లాన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



