బాక్సాఫీస్ బరిలో నాగార్జున, అమల!
on Aug 9, 2022

అక్కినేని నాగార్జున, అమల దంపతులు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారు. వారు కీలక పాత్రల్లో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో శర్వానంద్ త్వరలో 'ఒకే ఒక జీవితం' అనే సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తన కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాపై శర్వా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ కాగా, కీలక పాత్రలో అమల కనువిందు చేయనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే అదే రోజున నాగార్జున నటించిన సినిమా విడుదలవుతుండటం విశేషం.

రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఈ ఫ్రాంచైజ్ నుంచి శివ పేరుతో రానున్న మొదటి పార్ట్ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంటే నాగార్జున నటించిన 'బ్రహ్మాస్త్ర', అమల నటించిన 'ఒకే ఒక జీవితం' ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



