శర్వానంద్ హిట్ కొట్టాడు.. 9 రోజుల్లోనే 'ఒకే ఒక జీవితం' బ్రేక్ ఈవెన్
on Sep 18, 2022

శర్వానంద్ ఎదురు చూపులకు బ్రేక్ పడింది. కొన్నేళ్లుగా వరుస పరాజయాలు ఎదుర్కొంటూ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న శర్వాకి 'ఒకే ఒక జీవితం' రూపంలో భారీ ఊరట లభించింది. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం 9 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ గా నిలిచింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.7.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'ఒకే ఒక జీవితం'.. తొమ్మిది రోజుల్లో రూ.8.29 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది. అయితే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ స్టేటస్ దక్కించుకున్నప్పటికీ కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లో రూ.6.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'ఒకే ఒక జీవితం'.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి తొమ్మిది రోజుల్లో రూ.5.35 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటిదాకా నైజాంలో 2.65 కోట్ల షేర్(బిజినెస్ 2.5 కోట్లు), సీడెడ్ లో 42 లక్షల షేర్(బిజినెస్ 80 లక్షలు), ఆంధ్రాలో 2.28 కోట్ల షేర్(బిజినెస్ 3.20 కోట్లు) వసూలు చేసింది. నైజాంలో ఇప్పటికే ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయినప్పటికీ.. సీడెడ్, ఆంధ్రాలో స్వల్ప నష్టాలు తప్పవేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వారం విడుదలైన సినిమాలేవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. మరి ఈ వారం పుంజుకొని సీడెడ్, ఆంధ్రాలో కూడా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందేమో చూడాలి.
రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో మాత్రం మంచి లాభాలతో దూసుకుపోతోంది 'ఒకే ఒక జీవితం'. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి రూ.1 కోటి బిజినెస్ చేయగా.. తొమ్మిది రోజుల్లోనే తమిళనాడులో రూ.1 కోటి షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 44 లక్షల షేర్, ఓవర్సీస్ లో 1.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



