జపాన్ లో భారీ స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్!
on Sep 18, 2022
.webp)
'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్స్ లో విడుదలై దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఇక ఓటీటీలో విడుదలయ్యాక హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ చిత్రాన్ని చూసి ఫిదా అయ్యారు. ఈ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వెస్టర్న్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పలు దేశాల్లో థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది ఆర్ఆర్ఆర్.
అక్టోబర్ 21న 'ఆర్ఆర్ఆర్'ని జపాన్ లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అక్కడ భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రమోషన్స్ లో రాజమౌళి దిట్ట. ఆయన సినిమాని ఎంత శ్రద్ధగా తెరకెక్కిస్తాడో, ఆ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడంలోనూ అంతే దృష్టి పెడతాడు. జపాన్ లోనూ ఏదో మొక్కుబడిగా రిలీజ్ చేయకుండా, తన మార్క్ ప్రమోషన్స్ తో విడుదల చేయబోతున్నారట. తారక్, చరణ్ తో పాటు ఇతర మూవీ టీమ్ తో కలిసి జపాన్ వెళ్లి అక్కడ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
'బాహుబలి'కి జపాన్ లో మంచి ఆదరణే లభించింది. పైగా అక్కడ తారక్ కి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన డ్యాన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా ఎన్నో సానుకూల అంశాలతో జపాన్ లో విడుదలవుతున్న ఆర్ఆర్ఆర్ అక్కడ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. జపాన్ తో పాటు చైనా మరియు ఇతర దేశాల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ దేశాల్లో ఆదరణ లభిస్తే ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు గ్రాస్ పెరిగే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



