‘బ్రూస్ లీ’లో కామెడీ లేదా?
on Oct 12, 2015
.jpg)
శ్రీను వైట్ల అంటే టాలీవుడ్‌లో కామెడీకి ట్రేడ్ మార్కు. కెరీర్ ప్రారంభంలో సీరియస్ సినిమా తీసి చేతులు కాల్చుకున్న శ్రీనువైట్ల ‘ఆనందం’ సినిమా నుంచి కామెడీని నమ్ముకున్నాడు. తన సినిమాల్లో మూసలో పోసినట్టుగా ఒకే తరహా కామెడీని అందిస్తూ వున్నా, శ్రీనువైట్ల స్కూల్ ఆఫ్ కామెడీ టాలీవుడ్‌లో బాగానే వర్కవుట్ అయింది. ‘దూకుడు’ సినిమాతో ఆ కామెడీ పీక్స్‌కి వెళ్ళిపోయింది. అయితే ‘ఆగడు’లో చేయించిన కామెడీ అయ్యగారికి షాకిచ్చింది.
అందుకే లేటెస్ట్‌గా తీసిన రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాలో మాత్రం శ్రీనువైట్ల కామెడీ జోలికి పెద్దగా వెళ్ళినట్టు లేదని టాలీవుడ్‌లో అనుకుంటున్నారు. పైగా హీరో రామ్ చరణ్ కామెడీ చేస్తే పండుతుందో లేదో అనే డౌట్ ఒకవైపు, భారీ యాక్షన్ సినిమాలో మధ్యమధ్యలో కామెడీ వస్తే మూడ్ మిస్సవుతుందనే డౌట్ మరోవైపు పీడించడంతో ఈ సినిమాలో కామెడీ పాళ్ళను కాస్త తక్కువగానే మిక్స్ చేశారట.
సబ్జెక్ట్ డిమాండ్ చేయపోవడం వల్ల, తనమీద మరీ కామెడీ దర్శకుడిగా ముద్ర పడటం వల్ల ‘బ్రూస్ లీ’లో కామెడీకి శ్రీనువైట్ల చాలా చిన్న పీట వేశాడని అంటున్నారు. సినిమాలో కామెడీ సీన్లు లేకపోయినా, సీరియస్ సీన్లు కూడా కామెడీగా వుంటే అదోరకం ఎంటర్‌టైన్‌మెంటు... ఏమంటారు?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



