నాగశౌర్యలో ఈ యాంగిల్ ఏంటో!
on Oct 12, 2015
.jpg)
ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న యంగ్ హీరోలో కనిపిస్తున్న కొత్త యాంగిల్ టాలీవుడ్ జనాలని బుగ్గలు నొక్కుకునేలా చేస్తోంది. నాగశౌర్యలో నాచురల్‌గానే ఈ యాంగిల్ వుందా.. లేక పబ్లిసిటీ కోసం ఇలాంటి యాంగిల్ చూపిస్తున్నాడా అని టాలీవుడ్ జీవులు చెవులు కొరుక్కుంటున్నారు.
నాగశౌర్య తనలో చూపిస్తున్న మరో యాంగిల్ సమాజ సేవ. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా నాగశౌర్య చిన్న హీరో అయినప్పటికీ పెద్ద పెద్ద హీరోలు కూడా చేయని పనులు చేస్తూ అందరి దృష్టిలో పడుతున్నాడు. ఆమధ్య విశాఖకు తుఫాను వస్తే, మనోడు వెంటనే ఒక వీడియో తీసేసి యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసేశాడు.. తుఫాను బాధితులను అందరూ ఆదుకోవాలని చేతులెత్తి ప్రార్థించాడు.
తనవంతు సహాయాన్ని కూడా చేస్తున్నానని చెప్పాడు. అప్పుడలా చేస్తే, లేటెస్ట్‌గా ఒక అమర జవాను కుటుంబానికి అర్థిక సాయం అందించి మరోసారి ఈ కోణంలో వార్తల్లోకి వచ్చాడు. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మరణించిన సత్యం అనే జవాన్ కుటుంబం ఇంటికి వెళ్ళి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగశౌర్య తనవంతు సహాయంగా 50 వేల రూపాయలను అందించాడు. మొత్తమ్మీద పబ్లిసిటీ కోసం చేసినా, స్పందించి చేసినా నాగశౌర్య మంచిపనే చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



