పెళ్లి కాకుండానే నిత్యా మీనన్ ప్రెగ్నెంట్?
on Oct 28, 2022

పెళ్లి కాకుండానే హీరోయిన్ నిత్యా మీనన్ తల్లి కాబోతోందా? అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఒక ఫోటోనే ఈ చర్చకు దారితీసింది. అయితే ఆమె ప్రెగ్నెంట్ కాదని, కొత్త మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇలా చేసిందని తెలుస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటోని షేర్ చేసిన నిత్యా మీనన్ "వండర్ మొదలైంది" అని రాసుకొచ్చింది. దీంతో ఆ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. అసలు నిత్యా మీనన్ కి పెళ్లి ఎప్పుడు అయింది? పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ ఎలా అయింది? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె ఇదంతా మూవీ ప్రమోషన్ లో భాగంగా చేసినట్టు సమాచారం.
'బెంగళూరు డేస్' ఫేమ్ అంజలి మీనన్ దర్శకత్వంలో మలయాళంలో 'వండర్ ఉమెన్' అనే సినిమా రూపొందుతోంది. ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగానే నిత్యా మీనన్ సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టిందట. అంతేకాదు మరో నటి పార్వతి సైతం అదే పోస్ట్ పెట్టడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



