నితిన్ ప్లానింగ్...అట్టర్ ఫ్లాప్
on Sep 7, 2015

సినిమా ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టాలంటే అదృష్టం ఉండాలి. నిలదొక్కుకోవాలంటే మాత్రం ప్రతిభ కావాలి. వచ్చిన స్థానాన్ని కాపాడుకోవడానికి ప్లానింగ్ అత్యవసరం. అదృష్టం, ప్రతిభ ఉండీ.. ప్లానింగ్ విషయంలో డీలా పడితే పరిస్థితి నితిన్‌లానే తయారవుతుంది. వరుస హిట్స్ ఇచ్చి ఊపు మీద ఉన్న హీరో నితిన్. వరుసగా మూడు హిట్స్ ఇచ్చి మళ్లీ రేసులోకి వచ్చాడు. అయితే సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల తన కెరీర్‌కి తానే ఇబ్బందులు తెచ్చిపెట్టుకొంటున్నాడు. చినదానా నీకోసం సినిమా వచ్చి దాదాపు యేడాది అయ్యింది. ఆ తరవాత నితిన్ నుంచి సినిమాలేదు. కొరియర్ బోయ్ కల్యాణ్ చేశాడు గానీ... అది లేట్ గా రిలీజ్ అవుతోంది.
ఈసినిమాపై ఎవరికీ అంచనాలు లేవు. త్రివిక్రమ్‌తో సినిమా అంటున్నారుగానీ.. అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలీదు. మిగిలిన హీరోలంతా గేరు మార్చి, స్పీడు పెంచి... దూసుకుపోతున్నారు. చేతిలో హిట్స్ ఉన్నా లేకున్నా.. సినిమాలకు మాత్రం లోటు లేకుండా చేసుకొంటున్నారు.కానీ నితిన్ పరిస్థితి మాత్రం అందుకు రివర్స్‌లో వెళ్తోంది. హిట్స్ పడినప్పుడే లేట్ అవుతున్నాడు. కొరియర్ బోయ్ ఫ్లాప్ అయితే.. నితిన్ కి మళ్లీ బ్యాడ్ డేస్ మొదలైనట్టే. ఎందుకంటే వరుసగా రెండు ఫ్లాపులు.. ఆ తరవాత యేడాది గ్యాప్ విపరీతమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫ్లాప్ ఇచ్చినా జనం మర్చిపోవాలంటే సినిమాలపై సినిమాలు చేస్తూపోవాలన్న సత్యం నితిన్ ఎప్పుడు తెలుసుకొంటాడో, ఏంటో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



