మోక్షజ్ఞకు అప్పుడే ఫ్యాన్ ఫాలోయింగా??
on Sep 7, 2015

వారసత్వం నిజంగా దేవుడిచ్చిన వరం. అందులోనూ నట వారసత్వం అంటే మాటలా? పుట్టుకతోనే స్టార్లయిపోతారు. నందమూరి మోక్షజ్ఞ కూడా అంతే. ఈ నందమూరి వారసుడి ఎంట్రీ గురించి అభిమానగణం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తోంది. మరోవైపు బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ క్లారిటీతో ఉన్నాడు. 2016లో మోక్షజ్ఙను వెండి తెరపై చూడొచ్చన్న సంకేతాలు పంపేశాడు. ఈమధ్యే ఈ నందమూరి వారసుడు పుట్టిన రోజు జరుపుకొన్నాడు. బాలయ్య పుట్టిన రోజుకు అభిమానులు ఎంత సందడి చేస్తారో, మోక్షజ్ఞ పుట్టినరోజుకీ అంతే హంగామా చేశారు. కేకులు కట్ చేసి, రక్తదానాలు చేసి తమ ప్రేమ చాటుకొన్నారు.

నారా రోహిత్ ఆధ్వర్యంలో ఫ్యాన్స్ కేకులు కట్ చేసి, మోక్షజ్ఙకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ నందమూరి వారసుడు ఇంకా ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టనేలేదు. అప్పుడే అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని తెచ్చేసుకొన్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ డాన్స్, ఫైట్స్ తదితర విషయాల్లో శిక్షణ తీసుకొంటున్నాడట. తన బాడీనీ బిల్డప్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. అందుకే మోక్షజ్ఞ బయట ఎక్కడా కనిపించకుండా బాలయ్య తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. ఒక్కసారిగా వారసుడ్ని అభిమానులకు పరిచయం చేసి వాళ్లని సర్‌ప్రైజ్ చేయాలన్నది బాలయ్య ఆలోచన.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



