నాని సినిమా బిజినెస్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే!
on Apr 11, 2017
అష్ట చెమ్మ రిలీజ్ అయింతర్వాత నాని వన్ మూవీ వండర్ అన్న వల్లే ఎక్కువ. ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లో మనోడు ఎక్కువ రోజులు నెగ్గుకు రాలేడు అని అభిప్రాయం పడ్డారు. పిల్ల జమిందార్ తర్వాత నాని హిట్ కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా నాని పని అయిపోయినట్టే అని అనుకున్నారు. అయితే, రాజమౌళి తీసిన ఈగ నాని జీవితాన్నే మార్చేసింది. కానీ, మారుతీ దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. నాని సినిమాలు మినిమం గ్యారంటీ అని అటు ప్రేక్షకులు, ఇటు నిర్మాతలు, వీళ్ళు కాకుండా బయ్యర్లు అనుకునే స్థాయికి చేరుకున్నాడు మన నాచురల్ స్టార్. నాని తదుపరి చిత్రం నిన్ను కోరి ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఉన్న డిమాండ్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే.
ఏషియన్ సినిమా వాళ్ళు నిన్ను కోరి నైజం, ఆంధ్ర పంపిణీ హక్కులు 14 కోట్లు వెచ్చించి తీసుకోవడం నాని ప్రస్తుత రేంజ్ తెలుపుతుంది. ఓవర్సీస్ మరియు ఇతర ఏరియా హక్కుల కోసం కూడా పోటీ గట్టిగానే ఉంది అని చెబుతున్నారు. నాని మినిమం గ్యారంటీ హీరోనే కానీ, ఇంత డబ్బు పెట్టడం ఒక విధంగా రిస్క్ అంటున్నారు ట్రేడ్ పండితులు. చూద్దాం, నిన్ను కోరి బయ్యర్లకు లాభాలు తెచ్చి పెడుతుందా లేక నష్టాలూ మిగిలిస్తుందా. శివ నిర్వాణం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై లో విడుదలవనుంది.
Also Read